భారత్-ఇంగ్లాండ్ రెండో వన్డేలో నమోదైన రికార్డులు.. !

శుక్రవారం ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డే టీమిండియాకు షాక్ తగిలిగింది. టీమిండియా నిర్దేశించిన 337 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఈజీగా చేధించింది. కేవలం 43.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దాంతో 1-1తో సిరీస్‌ను సమం చేసింది.

జేసన్‌రాయ్‌(55; 52 బంతుల్లో 7×4, 1×6), జానీ బెయిర్‌స్టో (124; 112 బంతుల్లో 11×4, 7×6) తొలి వికెట్‌కు 110 పరుగులు జోడించగా, తర్వాత వచ్చిన బెన్‌స్టోక్స్‌(99; 52 బంతుల్లో 4×4, 6×10) విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ మ్యాచ్ లో పలు రికార్డులు నమోదయ్యాయ్. ఆ వివరాలపై ఓ సారి ఫోకస్ చేస్తే.. 

 * మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తూ పదివేల పరుగుల మైలురాయి చేరుకున్న తొలి టీమ్‌ఇండియా ఆటగాడిగా విరాట్‌ రికార్డు సృష్టించాడు. మొత్తంగా రెండో ఆటగాడిగా ఉన్నాడు. అంతకుముందు ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్‌ (12662) ఈ ఘనత సాధించాడు.

* వన్డే చరిత్రలో టీమ్‌ఇండియాపై ఇంగ్లాండ్‌కిదే అత్యుత్తమ భారీ ఛేదన

* ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌స్టోకు ఇది 11వ శతకం. ఇంగ్లాండ్ తరఫున అత్యంత వేగంగా ఈ మైలురాయి చేరుకున్న ఆటగాడిగా నిలిచాడు. అతడికిది 78వ ఇన్నింగ్స్‌. హషీమ్‌ ఆమ్లా 64, క్వింటన్‌ డికాక్‌ 65, బాబర్‌ అజామ్‌ 71 ఇన్నింగ్స్‌ల్లో వన్డేల్లో 11వ సెంచరీ సాధించారు.

* అంతర్జాతీయ క్రికెట్‌లో అదిల్‌ రషీద్‌.. విరాట్‌ కోహ్లీని అత్యధికంగా తొమ్మిది సార్లు ఔట్‌ చేశాడు. అంతకుముందు కివీస్‌ బౌలర్‌ టిమ్‌ సౌథీ అత్యధికంగా పది సార్లు టీమ్‌ఇండియా సారథిని పెవిలియన్‌ పంపాడు.