రాహుల్ సంబరాల వెనక.. అసలు కథ !
సెంచరీ చేసిన తర్వాత ఏ ఆటగాడైనా సంబరాలు చేసుకుంటాడు. అయితే టీమిండియా బ్యాట్స్ మెన్ కెఎల్ రాహుల్ సంబరాలు మాత్రం భిన్నంగా ఉంటాయి. ఆయన సెంచరీ చేసిన తర్వాత కూల్ గా హెల్మెట్ తీసి బ్యాటు కిందపెట్టి రెండు చేతులతో చెవులను మూసుకుంటాడు.
ఎందుకలా చేస్తాడో రాహుల్ శుక్రవారం మ్యాచ్ ముగిసిన తర్వాత రాహుల్ వివరించాడు. ‘బయటి రణగొణ ధ్వనులను ఆపేసేందుకే ఈ సంబరాలు. ఎవరినీ అవమానించేందుకు మాత్రం కాదు. మనల్ని వెనక్కి లాగే చాలామంది బయట ఉంటారు. అన్నిసార్లూ వారిని పట్టించుకోకూడదు. నా సంబరాల సందేశం అదే’ అని తెలిపాడు. శుక్రవారం ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో రాహుల్ శతకం బాదేశాడు. 114 బంతుల్లో 108 పరుగులు సాధించాడు. ప్రత్యర్థికి 337 పరుగుల లక్ష్యం నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఈ 337 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఈజీగా ఊదేసింది. సిరీస్ ని 1-1 సమం చేసింది.