తెలంగాణలో మళ్లీ లోకల్ వార్

తెలంగాణలో మళ్లీ లోకల్ వార్ జరగనుంది. రాష్ట్రంలోని ఖాళీ జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌, వార్డు స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్‌ఈసీ రెడీ అవుతోంది. ఆయా చోట్ల ఓటరు జాబితా తయారీకి ఎస్‌ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏప్రిల్‌ 4న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురించనున్నట్లు తెలిపింది. 

ఏప్రిల్‌ 8వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి, ఏప్రిల్‌ 12న ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నట్లు పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 34 ఎంపీటీసీ స్థానాలు, 99 సర్పంచ్‌, 2,004 వార్డు సభ్యుల పదవులు ఖాళీగా ఉన్నట్లు ఎస్‌ఈసీ తెలిపింది. 20 గ్రామ పంచాయతీల్లో అన్ని పదవులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. మరోవైపు నాగార్జున సాగర్ ఉప ఎన్నికతో తెలంగాణలో మరోసారి రాజకీయాలు హీటెక్కుతున్న సంగతి తెలిసిందే.