చరణ్ బర్త్ డే.. చిరు ఎమోషనల్ వీడియో !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఆయనకు సన్నిహితులు, స్నేహితులు, సినీ ప్రముఖులు, అభిమనుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్. చరణ్ బర్త్ డే రోజున మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. ఓ ఎమోషనల్ వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 
అప్పుడు.. ఇప్పుడు.. ఎల్లప్పుడూ అంటూ… తన మీద చరణ్ చూపించే కేరింగ్ కు సంబంధించిన ఫోటోలతో కూడిన ఓ వీడియోని షేర్ చేశారు. అది మెగా అభిమానులని ఆకట్టుకుంటుంది. ఇక చరణ్ బర్త్ డే కానుకగా అభిమానులకు ట్రిపుల్ ట్రీట్ అందింది. ఆర్ ఆర్ ఆర్ నుంచి అల్లూరి కొత్త పోస్టర్ శుక్రవారమే విడుదలైంది. ఇక ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. చిరుతో కలిసి ఉన్న చరణ్ పిక్ ని వదిలారు. దిల్ రాజు #RC15 అప్ డేటుని సింపుల్ గా చెప్పేశారు. త్వరలోనే #RC15 రెగ్యూలర్ షూటింగ్ మొదలు కానుందని ట్విట్ చేశారు. ఈ చిత్రానికి గ్రేట్ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. 

Happy Birthday My Boy @AlwaysRamCharan pic.twitter.com/iKRZ0G8Ji5— Chiranjeevi Konidela (@KChiruTweets) March 26, 2021