‘ధనరాజ్’ని టార్గెట్ చేసిన మెగా ఫ్యాన్స్

జబర్థస్త్ నటుడు ధనాధన్ ధనరాజ్ మెగా అభిమానులకి టార్గెట్ గా మారాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా ‘ఆచార్య’ సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆచార్య ‘సిద్ధ’ అంటూ చరణ్ ఫస్ట్ లుక్ ని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ధర్మానికి ధైర్యం తోడైతే అంటూ దర్శకుడు కొరటాల శివ సిద్ధ ఫస్ట్ లుక్ ని పంచుకున్నారు. చిరు-చరణ్ ఇద్దరు కలిసి రావడంతో మెగా అభిమానులు ఖుషి అయ్యారు. ఆ ఆనందాన్ని సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.


ఈ క్రమంలో ధనరాజు ఒకింత షాకింగ్ కామెంట్ పెట్టారు. చిరు ట్విట్ ని రీ ట్విట్ చేసిన ధనరాజ్.. ” ‘ఎగ్జిట్’ అవ్వడానికి అర్హత కావాలి. అందుకే మిమ్మల్ని ఆచార్య అంటారేమో.. !” అంటూ కామెంట్ పెట్టారు. ఈ కామెంట్ లో ఆంతర్యం ఏంటీ ? అని అర్థంకాక.. మెగా అభిమానులు ధనరాజ్ ని టార్గెట్ చేయడం మొదలెట్టారు. డ్యామేజ్ ని అర్థం చేసుకున్న ధనరాజ్…. ‘excitement’లో ఎగ్జిట్ అని పెట్టానని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. మెగా అభిమానులు కన్విన్స్ కాలేదు. దీంతో.. తన చేసిన రెండు ట్విట్లని ధనరాజ్ తొలగించేశారు. పాపం.. ధనరాజ్ అభిమానంతో పెట్టిన కామెంట్ కూడా.. అవమానాలని తెచ్చిపెట్టింది.