పిక్ ఆఫ్ ది డే : అల్లూరితో కొమరం భీమ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే.. సందర్భంగా సోషల్ మీడియాలో మోత మ్రోగిస్తున్నారు మెగా అభిమానులు. చరణ్ పర్సనల్, సినిమా విశేషాలతో కూడిన పోస్టర్లని, పిక్ లని షేర్ చేస్తున్నారు. ఇందులో చరణ్ అరుదైన ఫోటోలు కూడా ఉంటున్నాయి. మరోవైపు సన్నిహితులు, స్నేహితు, సినీ ప్రముఖుల నుంచి రామ్ చరణ్ కి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్. ఇక ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందం చరణ్ బర్త్ డేని స్పెషల్ గా సెలబ్రేట్ చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


అయితే చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో యంగ్ టైగర్ ఎన్ టీఆర్ షేర్ చేసిన ఫోటోనే హైలైట్. చరణ్ భుజంపై తలపెట్టి చూస్తున్న ఫోటోని తారక్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం ఎన్నో మధురానుభూతులు మిగిలిపోనున్నాయని తెలిపారు. ఈ ఫోటో ఆర్ ఆర్ ఆర్ సెట్స్ తీసుకొన్న దానిలా ఉంది. ఇప్పుడీ.. ఈ పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తారక్-చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే.

This year is going to be remarkable for us. Will always cherish the moments spent with you my brother.
Many Happy Returns @alwaysramcharan pic.twitter.com/WQBSRK6WhY— Jr NTR (@tarak9999) March 27, 2021