వైరల్ : #RRR సెట్ లో చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోస్ !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఆయనకు సన్నిహితులు, స్నేహితులు, సినీ ప్రముఖులు, అభిమనుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్. తాజాగా #RRR సెట్స్ లో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. దానికి సంబంధించిన ఫోటోలని ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ట్విట్ చేసింది. ఇందులో దర్శకధీరుడు రాజమౌళి చరణ్ కి ప్రేమగా కేక్ తినిపించడం చూడొచ్చు.

ఈ వేడుకల్లో జక్కన్న తనయుడు కార్తికేయ, ఆర్ ఆర్ ఆర్ సినిమాటోగ్రాఫర్ సెంథిల్.. ఇతర చిత్రబృందాన్ని చూడొచ్చు. కొమరం భీమ్ ఎన్ టీఆర్ మాత్రం ఈ వేడుకల్లో కనిపించలేదు. ఇక రామ్ చరణ్ బర్త్ డే కానుకగా మెగా అభిమానులకు ట్రిపుల్ ట్రీట్ అందింది. ఆర్ ఆర్ ఆర్ నుంచి అల్లూరి కొత్త పోస్టర్ శుక్రవారమే విడుదలైంది. ఇక ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. చిరుతో కలిసి ఉన్న చరణ్ పిక్ ని వదిలారు. దిల్ రాజు #RC15 అప్ డేటుని సింపుల్ గా చెప్పేశారు. త్వరలోనే #RC15 రెగ్యూలర్ షూటింగ్ మొదలు కానుందని ట్విట్ చేశారు. ఈ చిత్రానికి గ్రేట్ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే.