టీమిండియాకు అశ్విన్, జడేజాలే దిక్కా ?

టీమిండియా బలం పేస్ కాదు. స్పిన్. భారతపర్యటనకు వచ్చిన జట్లని స్పిన్ ఉచ్చులో బిగిచ్చి విజయాలు సాధించడం టీమిండియాకు అలవాటు. అది టెస్ట్, వన్డే, టీ20.. పార్మెట్ ఏదైనా.. స్పిన్ నే మన ప్రధాన బలం. అయితే ప్రస్తుతం టీమిండియాలో మంచి స్పిన్నర్లు కరువయ్యారు. శుక్రవారం ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టీ20లో టీమిండియా స్పిన్నర్లు కుల్ దీప్, క్రునాల్ పాండే తేలిపోయారు. దారళంగా పరుగులు సమర్పించుకున్నారు.

రెండో వన్డేలో కుల్ దీప్ ఏకంగా 84 పరుగులు ఇచ్చాడు. ఇందులో 8 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక కృనాల్ 6 ఓవర్లలోనే 72 పరుగులు ఇచ్చేశాడు. దీంతో ఆఖరి వన్ డేకు వీరిద్దరిని పక్కన పెట్టే అవకాశాలున్నాయి. ఫామ్‌లో లేనప్పటికీ యుజ్వేంద్ర చాహల్‌నే తీసుకోనున్నారు. సుందర్ ని కూడా ఆడిస్తారని తెలుస్తోంది. నిర్మోహమాటకంగా మాట్లాడుకుంటే.. ప్రస్తుతం టీమిండియాలో సూపర్ స్పిన్నర్లు లేరు. ఇప్పటికీ అశ్విన్, జడేజాలనే నమ్ముకోక తప్పని పరిస్థితి. కానీ అశ్విన్ ని టెస్టులకే పరిమితం చేస్తున్నారు. జడేజా గాయంతో ఆటకు దూరమయ్యాడు. బుమ్రా లేకుంటే పేస్ విభాగం కూడా పలచనైంది. భువి ఒక్కడే ఆకట్టుకుంటున్నారు. శార్థూల్, ప్రసిద్ధ్ కృష్ణ అప్పుడప్పుడు మెరిసిన.. నమ్మదగ్గ వారిగా ఇంకా పరిణతి చెందలేదు.