టాలీవుడ్ లో విషాదం.. వేదం నటుడు నాగయ్య మృతి !

టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ‘వేదం’ నటుడు నాగయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా దేసవరం పేటకు చెందిన నాగయ్య ‘వేదం’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో తాత పాత్రలో ప్రాణం పోశారు. ఆ తర్వాత నాగవల్లి, ఒక్కడినే, స్టూడెంట్ సార్, ఏ మాయ చేశావే, రామయ్య వస్తావయ్యా, స్పైడర్, విరంజి తదితర చిత్రాల్లో నటించారు.

కరోనా లాక్‌డౌన్ తర్వాత సినిమా ఆఫర్లు లేక ఆర్థిక ఇబ్బందుల్లో నాగయ్యాకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. మా ఆసోసియేషన్ కూడా అండగా నిలిచింది. ఇటీవలే అనారోగ్యంతో నాగయ్య భార్య కన్నుమూసింది. కొద్దిరోజుల క్రితం అనారోగ్యానికి గురైన నాగయ్య కూడా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. నాగయ్య మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.