వెంకీ నుంచి కాఫీ లాంటి సినిమా

కాఫీ లాంటి సినిమాలు తీసుంటారు శేఖర్ కమ్ముల. ఆయన సినిమా కోసం ఎదురు చూసే ప్రత్యేక ప్రేక్షక వర్గం ఉంది. ‘ఫిదా’ తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న ‘లవ్స్టోరీ’ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. ఇటీవల విక్టరీ వెంకటేష్ ని కలిసి కథని వినిపించారు. వెంకీకి కూడా కథ నచ్చేసింది. వెంటనే ఓకే చెప్పేశారని సమాచారమ్. 

ప్రస్తుతం వెంకీ ఎఫ్3, నారప్ప, దృశ్యం 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత శేఖర్ కమ్ములతో వెంకీ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ‘లవ్ స్టోరీ’ తర్వాత వెంకీతో శేఖర్ కమ్ముల సినిమా ఉండనుంది. మరీ.. వెంకీతో శేఖర్ కమ్ముల కామెడీ ఎంటర్ టైనర్ తీస్తాడా.. ? లేదా అద్భుమైన ఫ్యామిలీ సినిమాని తీసుకొస్తాడా ? అన్నది ఆసక్తి గా మారింది.