మూడో వన్డేలో టీమిండియా థ్రిల్లింగ్ విన్ & సిరీస్ కైవసం !

ఇంగ్లాండ్ తో జరిగిన ఆఖరిదైన మూడ్ వన్డే టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. టీమిండియా నిర్దేశించిన 330 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ దాదాపు చేధించినంత పని చేసింది. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కరణ్ (95*) పట్టుదలతో ఆడాడు. గెలిపించినంత పని చేశాడు. అయితే ఆఖరి ఓవర్ లో ఉడ్ రన్ అవుట్ కావడంతో.. ఇంగ్లాండ్ కు చేధన కష్టమైంది. లేకపోతే గెలిచేదేమో.. ! ఆఖరి ఓవర్ లో 14 పరుగులు అవసరం కాగా.. కేవలం 8 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.


అంతకుముందు టీమిండియా 48.2 ఓవర్లలో 329 పరుగులకి ఆలవుట్ అయింది. రిషబ్ పంత్ (78, 62 బంతుల్లో, 5ఫోర్లు, 4 సిక్సులు), హార్థిక్ పాండ్యా (64, 44 బంతుల్లో5ఫోర్లు, 4 సిక్సులు) ఆటనే టీమిండియా ఇన్నింగ్స్ లో హైలైట్. ఓపెనర్ శిఖర్ ధావన్ 67 (56బంతుల్లో, 10 ఫోర్లు) రాణించారు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 37 పరుగులు చేశారు. కెప్టెన్ కోహ్లీ 7, కె ఎల్ రాహుల్ 7 నిరాశపరిచారు. ఇద్దరు ఓపెనర్లు, కోహ్లీ చాలా త్వరగా అవుట్ అయినా.. పంత్, హార్థిక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.  ఆఖరులో కృనాల్ పాండ్యా 25, శార్థుల్ ఠాకూర్ 30 పరుగులు చేయడంతో టీమిండియా 300 మార్క్ ని దాటగలిగింది.