మూడో వ‌న్డే : ఇంగ్లాండ్ టార్గెట్ 330


మూడో వన్డే టీమిండియా 229 పరుగులకి ఆలౌట్ అయింది. రిషబ్ పంత్ (78, 62 బంతుల్లో, 5ఫోర్లు, 4 సిక్సులు), హార్థిక్ పాండ్యా (64, 44 బంతుల్లో5ఫోర్లు, 4 సిక్సులు) ఆటనే టీమిండియా ఇన్నింగ్స్ లో హైలైట్. ఓపెనర్ శిఖర్ ధావన్ 67 (56బంతుల్లో, 10 ఫోర్లు) రాణించారు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 37 పరుగులు చేశారు. కెప్టెన్ కోహ్లీ 7, కె ఎల్ రాహుల్ 7 నిరాశపరిచారు. ఇద్దరు ఓపెనర్లు, కోహ్లీ చాలా త్వరగా అవుట్ అయినా.. పంత్, హార్థిక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.


ఆఖరులో కృనాల్ పాండ్యా 25, శార్థుల్ ఠాకూర్ 30 పరుగులు చేయడంతో టీమిండియా 300 మార్క్ ని దాటగలిగింది. శార్థుల్, కృనాల్ అవుటైన తర్వాత భువనేశ్వర్ 5 , ప్రసిద్ధ కృష్ణ 0 ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. దీంతో టీమిండియా 48.2 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. టీమిండియా మొదటి నుంచి రెస్పాన్సబుల్ ఇన్నింగ్స్ కనబడింది. అయితే ఆఖరుల్లో మాత్రం నిరాశపరిచారు. వికెట్లు పడకుంటే.. ఈరోజు టీమిండియా 400 మార్క్ ని ఈజీగా క్రాస్ చేసేదే. బ్యాటింగ్ లో భీకర ఫామ్ లో ఉన్న ఇంగ్లాండ్ ని 330 పరుగులకి నియంత్రించడం అంత ఈజీ కాదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.