మూడో వన్డే : టీమిండియా 308/6 (43 ఓవర్లు)
ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఆఖరి వన్డే టీమిండియా భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. 43 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 310 పరుగులతో ఆటని కొనసాగిస్తోంది. ప్రస్తుతం క్రీజులో శార్థుల్ ఠాకూర్ (20), కృనాల్ పాండే (16) పరుగులతో ఉన్నారు.
ఈరోజు మ్యాచ్ లో రిషబ్ పంత్ (78, 62 బంతుల్లో, 5ఫోర్లు, 4 సిక్సులు), హార్థిక్ పాండ్యా (64, 44 బంతుల్లో5ఫోర్లు, 4 సిక్సులు) ఆటనే హైలైట్. ఓపెనర్ శిఖర్ ధావన్ 67 (56బంతుల్లో, 10 ఫోర్లు) రాణించారు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 37 పరుగులు చేశారు. కెప్టెన్ కోహ్లీ 7, కె ఎల్ రాహుల్ 7 నిరాశపరిచారు.
ఇద్దరు ఓపెనర్లు, కోహ్లీ చాలా త్వరగా అవుట్ అయినా.. పంత్, హార్థిక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అయితే వికెట్లు పడటంతో.. ఆఖరులో రన్ కాస్త తగ్గుతోంది. లేదంటే.. ఈరోజు టీమిండియా 400 మార్క్ ని ఈజీగా క్రాస్ చేసేదే. అయితే ఆఖరులో శార్థుల్ ఠాకూర్.. భారీ షాట్స్ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.