ఏపీకి కాబోయే సీఎం పవన్ కల్యాణ్.. బీజేపీ సంచలన ప్రకటన !

ఏపీలో భాజాపా-జనసేన కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి రాబోయే సార్వత్రిక ఎన్నికల వరకు కలిసి పనిచేస్తామని ఉమ్మడిగా ప్రకటన చేశాయి. అలాగే పని చేస్తున్నాయి. అయితే ఈ కూటమి సీఎం అభ్యర్థి ఎవరు ? అనే చర్చ చాన్నాళ్ల నుంచే జరుగుతోంది. దానికి ఏపీ భాజాపా అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదివారం సమాధానం ఇచ్చారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న సోము.. ఏపీకి కాబోయే సీఎం పవన్ కల్యాణ్ అన్నారు అన్నారు.


ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చారు. అయితే పవన్ ఏపీకి కాబోయే సీఎం అని సోము మనస్పూర్తిగా అన్నారా ? లేక పొలిటికల్ మైండ్ తో అన్నారా ? చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ? ఇటీవల భాజాపాపై జనసేన కాస్త అలకబూనింది. తిరుపతి సీటు తమకే కావాలని ఆఖరి వరకు పట్టుబట్టింది. అంతేకాదు.. తెలంగాణలో జరిగిన రెండు పట్టభద్రుల స్థానాలకు గానూ జనసేన మద్దతు భాజాపాకు దక్కలేదు. తెరాస అభ్యర్థులని గెలిపించాలని స్వయంగా పవన్ పిలుపునిచ్చారు. దాని రిజల్ట్ కూడా కనిపించింది. రెండు స్థానాల్లో జనసేన ఓడింది. తెరాస గెలిచింది. అంటే జనసేన మద్దతిచ్చిన తెరాస అభ్యర్థులు తెలిచారు. 

తెలంగాణతో ఏపీకి సంబంధం లేకున్నా.. గ్రేటర్ ఎన్నికల్లో జనసేన భాజాపాకు మద్దతిచ్చింది. ఆ ఎఫెక్ట్ కనిపించింది. గ్రేటర్ ఎన్నికల్లో తెలంగాణ భాజాపా బలం పెరిగింది. తెరాస అంచనాలని తలక్రిందులు చేయగలిగింది. అయితే గ్రేటర్ ఎన్నికల్లో మద్దతిచ్చిన తమకు తిరుపతి ఉప ఎన్నిక సీటు ఇస్తారని జనసేన భావించింది. కానీ అది జరగలేదు. దీంతో జనసేన భాజాపాపై కాస్త అసంతృప్తిగా కనిపించింది. బహుశా.. జనసైనికులు, ఆ పార్టీ అధినేత పవన్ లో ఆ అసంతృప్తిని పోగొట్టడానికి సోము తాజా వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా..పవన్ ఏపీకి కాబోయే సీఎం అని సోము అనడం జనసైనికులం వినసొంపుగా ఉంది. వారిని ఖుషి చేసింది కూడా.