రేవంత్ రెడ్డిని తొక్కేసే టైమొచ్చింది !
రేవంత్ రెడ్డి దూకుడు గురించి తెలిసిందే. చొరవగా పార్టీ కోసం పనిచేయడానికి దూకుడుగా వెళ్తూంటారు. అది నచ్చే ఆయనకు తెలంగాణ పీసీసీ పగ్గాలు అప్పగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం రెడీ అయింది. కానీ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అడ్డుపడ్డారని చెబుతుంటారు. ఎందుకంటే ? రేవంత్ రెడ్డి సీనియర్లని దేకడు. ఒక్కడ ఎగరేసుకొని పొతడు. అధిష్టానం.. అంటూ భయపడడు. వదిలిస్తే మరో వైఎస్ ఆర్ అవుతాడని.. తమని దేకడని సీనియర్ల భయం. అందుకే టైమ్ చూసి.. ఆయన్ని తొక్కేసి పనిలో ఉన్నారు.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. కానీ రేవంత్ సైలెటయ్యారు. ఆయన ఎక్కడా కనిపించడం లేదు. వారం రోజుల కిందట రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. దీంతో ఆయనను కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. రేపోమాపో రేవంత్ కు నెగెటివ్ వచ్చిన తర్వాత కూడా… ఆయన్ని సాగర్ ప్రచారానికి పిలిచే పరిస్థితుల్లేవ్. నాగార్జున సాగర్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా పోటీ ఉంది.
అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి గెలిస్తే ఆ అడ్వాంటేజ్ రేవంత్ రెడ్డి ఖాతాలోకి వెళ్లకూడదు అన్నది సీనియర్ల ప్లాన్. సాగర్ ఉపఎన్నిక తర్వాత పీసీసీ చీఫ్ మార్పు ఉంటుంది. అందుకే.. రేవంత్ రెడ్డి పాత్ర వీలైనంత తక్కువ ఉండేలా చూడాలని కాంగ్రెస్ సీనియర్లు ప్లాన్ చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి అనుచరులు, సన్నిహితులు కూన శ్రీశైలం బీజేపీలో చేరారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. దాన్ని కూడా రేవంత్ రెడ్డి మైనస్ గా అధిష్టానం దగ్గర చూపేందుకు కాంగ్రెస్ సీనియర్లు ప్లాన్స్ రచిస్తునట్టు తెలుస్తోంది. మొత్తానికి.. రేవంత్ ని తొక్కేయడానికి ఇదే అదను అనుకుంటున్నారేమో.. !