‘ఆచార్య’ మొదటి సాంగ్ వచ్చేసింది

సచిన్ స్టయిలీష్ షాట్స్.. మన మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులు ఒక్కటే. ఆ గ్రేస్ ఎంత చూసిన తనివి తీరదు. చాన్నాళ్ల తర్వాత మెగాస్టార్ స్టెప్పులేస్తే చూసే అవకాశం దక్కింది. ఆయన కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. మే 13న ఆచార్య ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలెట్టింది. ఇటీవలే టీజర్ ని విడుదల చేశారు. తాజాగా  ‘ఆచార్య’ నుంచి మొదటి సాంగ్‌ లిరికల్‌ వీడియో వచ్చేసింది.


 ‘లాహే లాహే..’అంటూ సాగుతున్న పాటలో చిరుతో పాటు కాజల్‌, సంగీత మెరిశారు. ముఖ్యంగా మణిశర్మ తన మార్కు మెలోడి డ్యాన్సింగ్‌ బీట్స్‌తో మోతెక్కించారు. రామజోగయ్యశాస్త్రి రచించిన ఈ పాటను హారిక నారాయణ్‌, సాహితి చాగంటి ఆలపించారు. పాట విడుదలైన కొద్ది నిమిషాల్లోనే 1.5మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం. ఇందులో 110కె లైక్స్ ఉన్నాయ్. ఈ లెక్కన ‘లాహే లాహే.. ‘ రికార్డుల దుమ్ముదులిపేలా కనిపిస్తోంది.