RRR : అజయ్‌ దేవ్‌గణ్ బర్త్ డే సప్రైజ్.. అదిరింది !

రామ్‌చరణ్‌, తారక్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ #ఆర్ఆర్ఆర్. ఇందులో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్ గణ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు అజయ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ఈ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. అజయ్ ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. సింగిల్ బిట్ సీన్స్ తో అద్భుతంగా ప్రజెంట్ చేసింది. 

ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, ఆయనకి జంటగా బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ నటిస్తున్నారు. కొమురం భీమ్‌గా తారక్, ఆయనకి జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఓలివియా మోరీస్ నటిస్తున్నారు. దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత. దసరా కానుకగా ఆర్ ఆర్ ఆర్ అక్టోబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.