పీసులేనా.. పెగ్గులూ.. ఉన్నాయా !

ఇద్దరు స్టార్స్ కలిస్తే ఆ సందడే వేరు. గురువారం సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కలిశారు. నాగ్ నే చిరు ఇంట్లో వాలిపోయాడు. నాగ్ కోసం చిరు గరిట తిప్పారు. చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేశారు. పార్టీ ఇచ్చారు. నాగ్ నటించిన ‘వైల్డ్ డాగ్’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ కి ముందే నాగ్ కి చిరు ఇచ్చిన పార్టీ ఇది అన్నమాట. 

దానికి సంబంధించిన ఫోటోని నాగ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. వైల్డ్ డాగ్ రిలీజ్ కూల్ టెన్షన్ లో ఉన్న తనకి మెగాస్టార్ స్వయంగా వంట చేసి.. అద్భుతమైన డిన్నర్ పార్టీ ఇచ్చారని చెబుతూ.. ఆయనకి థ్యాంక్స్ చెప్పారు నాగ్. ఇప్పుడీ.. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పీసులేనా.. పక్కకు పెగ్గులూ.. ఉన్నాయా ? అంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక ఈరోజుప్రేక్షకుల ముందుకొచ్చిన వైల్డ్ డాగ్ పై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది

A delicious dinner Cooked by the megastar himself to cool my nerves for #WildDog release tomorrow !! Thank you For a wonderful evening @KChiruTweets 🙏 picture courtesy Surekha garu 😊 pic.twitter.com/86FO5aWI1Q— Nagarjuna Akkineni (@iamnagarjuna) April 1, 2021