ఏకంగా 15 సినిమాలని లైన్’లో పెట్టేసిన పవన్ !

వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలని లైన్ లో పెట్టేసిన సంగతి తెలిసిందే. దాదాపు అరడజను సినిమాలని ఓకే చేశారు. వాటికి సంబంధించి అధికారిక ప్రకటనలు కూడా వచ్చేశాయ్. ఇటీవలే వకీల్ సాబ్ షూటింగ్ ని పూర్తి చేసిన పవన్.. ప్రస్తుతం క్రిష్ సినిమా ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు ‘‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కూడా సెట్స్ మీదకు వెళ్లింది. ఈ రెండు పూర్తయిన తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ సినిమా ఉండనుంది. ఆ తర్వాత సురేంద రెడ్డి, బంగ్ల గణేష్ తదితర సినిమాలు లైన్ లో ఉండనే ఉన్నాయి.


ఇవే కాకుండా మరో 15 సినిమాలని కూడా పవన్ లైన్ లో పెట్టేసినట్టు సమాచారమ్. అయితే ఇవి ఆయన హీరోగా కాదు. నిర్మాతగా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి సంయుక్తంగా 15సినిమాలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో సొంతంగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే బ్యానర్ ను స్థాపించిన పవర్ స్టార్ ఇదివరకే కొన్ని సినిమాలను నిర్మించాడు. ఇప్పుడు పవన్ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి వరుసగా సినిమాలు నిర్మించనుంది.  

ఈ 15 సినిమాల్లో 6 చిన్న సినిమాలు, 6 మిడియామ్ బడ్జెట్ సినిమాలతో పాటు మరో మూడు బిగ్ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తారట. ఈ మూడు భారీ బడ్జెట్ సినిమాల్లో స్టార్ హీరోలు నటించనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. 15 సినిమాల్లో కొన్నింటిలో పవన్ గెస్ట్ రోల్ లో మెరవడానికి కూడా రెడీ అవుతున్నట్టు సమాచారమ్. మొత్తానికి.. పవన్ నిర్మాతగా ఎక్కువ సినిమాలు చేయబోతున్నారు. రేపటి రోజున పవన్ పొలిటికల్ గా బిజీ అయినా.. ఆయన బ్రాండ్ పేరిట సినిమాలు వస్తాయి అన్నమాట.