‘వైల్డ్ డాగ్’పై సమంత రివ్యూ – హాలీవుడ్ స్టయిల్.. పవర్ ప్యాకెడ్..

అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో కింగ్ నాగార్జున నటించిన చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఎన్‌ఐఎ బృందం సీక్రెట్ ఆపరేషన్‌లో భాగంగా ఉగ్రవాదులను ఏరివేసే నేపథ్యంలో తెరకెక్కింది. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై నిరంజన్‌రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు  పెరిగిపోయాయ్. భారీ అంచనాల మధ్య వైల్డ్ డాగ్ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే బెనిఫిట్ షోస్ పడిపోయాయ్. 

అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ సమంత నిన్న రాత్రే వైల్డ్ డాగ్ సినిమాని చూసేశారు. అక్కినేని అభిమానుల కోసం స్వయంగా రివ్యూ కూడా అందజేశారు. మంచి యాక్షన్ సినిమా. హాలీవుడ్ స్టయిల్ లో పవర్ ఫ్యాకెడ్ లా ఉంది. మిమ్మల్ని సీటులో కదలకుండా కూర్చోబెట్టే ఉత్కంఠగా ఉంటుంది. ఎమోషన్స్ కూడా పండాయ్. మామ నాగార్జున లా ఇంకెవరు చేయలేరు’ అంటూ సామ్ ట్విట్ చేసింది.  సామ్ మాత్రమే కాదు.. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు వైల్డ్ డాగ్ బాగుందంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

Just watched #WildDog .. it is fantastic 🔥🔥🔥… I really have been missing a good action flick .. and I got a Hollywood style ,kickass power packed, emotional, edge of your seat kinda action film .. Just watch it 🙌.. @iamnagarjuna no one else could have pulled this off 🤗❤️— Samantha Akkineni (@Samanthaprabhu2) April 1, 2021