‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్ డేటు
‘వకీల్ సాబ్’గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వచ్చే వారం (ఏప్రిల్ 9) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్రబృందం. ఇందులో భాగంగా ఈ నెల 4న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసింది. యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో భారీగా నిర్వహిద్దామని ప్లాన్ చేసింది. కానీ, అందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిని ఇవ్వలేదు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రిస్క్ వద్దనే అనుమతిని నిరాకరించినట్టు తెలిసింది. దీంతో వకీల్ సాబ్ చిత్రబృందం ప్లాన్ మార్చింది.
ప్రీ రిలీజ్ వేడుక వేదికని హైటెక్ సిటీలోని నోవా టెల్ కి మార్చింది. పరిమిత సంఖ్యలో అభిమానులు, చిత్రబృందం సమీక్షంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించబోతున్నట్టు సమాచారమ్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరికాసేపట్లో రానుంది. ప్రస్తుతం దర్శకుడు వేణు శ్రీరామ్ ఈవెంట్ మేనేజర్ జ్ మీడియా నరేంద్రతో కలిసి చర్చిస్తున్నారు. అవి పూర్తవ్వగానే ప్రీ రిలీజ్ ఫంక్షన్ పై అధికారిక ప్రకటన రానుంది.
పవన్ రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రమిది. దీంతో వకీల్ సాబ్ కోసం ప్రేక్షకులు, ఇండస్ట్రీ ఆతృతగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పాటలు సూపర్ హిట్ అనిపించుకున్నాయ్. మంచి ఫామ్ లో ఉన్న థమన్ నేపథ్య సంగీతంలో ఇరగదీయడం ఖాయం. ఈ సినిమాలో శృతిహాసన్, అంజలి, నివేదా థామస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు.