రివ్యూ : వైల్డ్ డాగ్

చిత్రం : వైల్డ్‌డాగ్
నటీనటులు : నాగార్జున, దియా మీర్జా, సయామీఖేర్‌, అతుల్‌ కులకర్ణి, అలీ రెజా, అవిజిత్‌ దత్‌ తదితరులు
సంగీతం : ఎస్‌.తమన్
దర్శకత్వం : అహిషోర్‌ సాల్మన్  
నిర్మాత : నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి
రిలీజ్ డేటు : 02 ఏప్రిల్, 2021.

కొత్తదనం, కొత్త దర్శకులని పోత్సహించే అలవాటు కింగ్ నాగార్జునకి మొదటి నుంచి ఉంది. అదే ఆయన్ని శివ, అన్నమయ్య, గగనం.. లాంటి సినిమాల్ని చేసేలా చేసింది. ఈ వయసులోనూ.. నాగ్ మనసు కొత్తదనం వైపు లాగింది. అందుకే ఆయన వైల్డ్ డాగ్ కథని ఓకే చేశారు. ఈ చిత్రానికి అహిషోర్‌ సాల్మన్ దర్శకత్వం వహించారు. ఎన్‌.ఐ.ఎ నేప‌థ్యంలో సినిమా తెరకెక్కింది. ప్రచార చిత్రాలతో ఆకట్టుకున్న వైల్డ్ డాగ్ భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. ఆ అంచనాలని అందుకుందా ? 

కథ
ఏసీపీ విజ‌య్ వ‌ర్మ (నాగార్జున‌) ఉగ్ర‌వాదుల్ని ప‌ట్టుకోవ‌డం కంటే కూడా అంతం చేయ‌డానికే ఇష్ట‌ప‌డుతుంటాడు. అందుకే ఆయనకి ‘వైల్డ్ డాగ్’ అని పేరు. హైదరాబాద్ గోకుల్ చాట్ బాంబ్ బ్లస్ట్‌ లో కూతురు చనిపోవడం.. ఎన్‌.ఐ.ఎ (నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ)లో చేర‌తాడు. ఈ పేలుళ్ల వెన‌క సూత్ర‌ధారిని క‌నిపెట్ట‌డ‌మే ల‌క్ష్యంగా  రంగంలోకి దిగుతాడు.  ఇండియ‌న్ ముజాహిదీన్‌కి చెందిన ఖలీద్ హ‌స్తం ఉంద‌ని క‌నిపెడ‌తాడు.  అత‌ను ఇండియా నుంచి నేపాల్‌కి వెళ్లాడ‌ని తెలుసుకున్న విజ‌య్ వ‌ర్మ త‌న బృందంతో క‌లిసి అక్క‌డికి వెళ‌తాడు. దేశం కాని దేశంలో అత‌నికి ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి?  పేలుళ్ల సూత్ర‌ధారి ఖలీద్‌ని ఎలా ఇండియాకి తీసుకొచ్చాడు? అన్నది పూర్తి కథ.

నటీనటుల ఫర్ ఫామెన్స్ : 
భార‌త‌దేశంలో జ‌రిగిన బాంబు పేలుళ్ల సంఘ‌ట‌న‌ల్ని… దాని వెన‌క సూత్ర‌ధారుల్ని క‌నిపెట్టి  దేశానికి  తీసుకొచ్చిన ప‌రిణామాల ఆధారంగా తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ఇవన్నీ ప్రజలకి తెలిసిన విషయాలే. ప్రతి యేడాది.. ఈ విషాద ఘటనలపై పత్రికల్లో కథనాలు వస్తూనే ఉన్నాయ్. వీటినే దర్శకుడు  కథగా ఎంచుకున్నారు. పవర్ ప్యాకెడ్ గా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో కొంత మేరకు సక్సెస్ అయ్యారు. అయితే తొలి భాగంతో పోలిస్టే రెండో భాగం బాగుంది.

విజ‌య్ వ‌ర్మ క్యారెక్ట‌రైజేష‌న్‌లో కొత్త‌ద‌న‌మేమీ లేదు. కానీ ఆ పాత్రలో నాగ్ బాగా నటించారు. పాత్ర‌కి త‌గ్గ‌ట్టుగా క‌నిపించ‌డంతో పాటు…  యాక్ష‌న్ ఘ‌ట్టాల కోసం బాగా చెమ‌టోడ్చారు.స‌యామీ ఖేర్ పాత్ర ద్వితీయార్ధంలో సంద‌డి చేస్తుంది. రా ఏజెంట్‌గా క‌నిపిస్తుంది.  వైల్డ్‌డాగ్ టీమ్‌లో క‌నిపించిన న‌లుగురు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. మిగితా నటీనటులు పర్వాలేదనిపించారు.

సాంకేతికంగా :  
స్వతహా రచయిత అయినా అహిషోర్‌ సాల్మన్ పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. షానీల్ డియో సినిమాటోగ్రఫీ బాగుంది. నేప‌థ్య సంగీతంలో థమన్ అదరగొట్టేశాడు. ఎడిగింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

  • నాగ్ అండ్ టీం
  • యాక్షన్ సీన్స్
  • నేపథ్య సంగీతం
  • సినిమాటోగ్రఫీ
  • రెండో భాగం
  • మైనస్ పాయింట్స్ : 
  • తొలి భాగం
  • కథనం

  • ఫైనల్ గా : వైల్డ్ డాగ్.. యాక్షన్ ప్రియులని మెప్పిస్తాడు !
  • రేటింగ్ : 3/5
  • నోట్ : ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.