పరిషత్ ఎన్నికలు : హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ? రెడ్ సిగ్నల్ వేస్తుందా ?
ఏపీలో పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ భాజాపా, జనసేన హౌస్‌మోషన్ పిటిషన్స్ దాఖలు చేశాయి. ఎస్‌ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నాయి. రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా తీసుకోలేదని, పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరాయి. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎస్‌ఈసీ కౌంటర్ చేయాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో తాజాగా హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. నిబంధనల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు 45 పేజీల అఫిడవిట్‌ను కోర్టు ముందుంచింది. గతంలో నిలిచిన ఎన్నికలను యథావిధిగా కొనసాగిస్తున్నామని వివరించింది. ఎన్నికలు సజావుగా సాగేలా ఆదేశాలివ్వాలని కోరింది. మరీ.. పరిషత్ ఎన్నికలపై హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ? రెడ్ సిగ్నల్ వేస్తుందా ? అన్నది చూడాలి.