బీజేపీ-జనసేన ఐక్యత లేదా ?

ఏపీలో పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికలను రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయ్. దీనిపై దోస్తానా పార్టీలైనా బీజేపీ, జనసేన వేరు వేరుగా కోర్టుకు వెళ్లడం, న్యాయ పోరాటం ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. 

తాజాగా ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ జనసేన హౌస్‌మోషన్‌ పిటిషన్‌ వేసింది. ఎస్‌ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని పిటిషన్‌లో పేర్కొంది. రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా తీసుకోలేదని, పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరింది.అంతేకాకుండా సుప్రీం కోర్టు తీర్పుకు ఎస్‌ఈసీ తీరు విరుద్ధమని జనసేన స్పష్టం చేసింది. 

మరోవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ భాజపా కూడా హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో జనసేన-భాజాపా కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే. అలాంటప్పుడు… పరిషత్ ఎన్నికలపై ఈ రెండు పార్టీలు కలిసి న్యాయ పోరాటం చేయొచ్చు కదా.. ! వేరు వేరుగా కోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్ ఎందుకు ? పైకి కలిసే ఉన్నామని చెబుతున్నా.. ఈ రెండు పార్టీల మధ్య ఐక్యత లేదని మరోసారి నిరూపితమైందని తెలుస్తోంది.