వైరల్ : చిరుతతో నోముల భగత్ వాకింగ్

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థిగా నోముల నరసింహారెడ్డి తనయుడు నోముల భగత్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆయన గెలుపు కోసం తెరాస శ్రేణులు బాగానే శ్రమిస్తున్నాయ్. అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా.. సీనియర్ నేత జానారెడ్డి బరిలో ఉండటంతో.. ఇక్కడ టఫ్ ఫైట్ నడుస్తోంది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం, పాత రాజకీయాలు జానాకు కలిసొస్తాయని విశ్లేషులు చెబుతున్నారు. ఇక నోముల భగమ్ మాత్రం సీఎం కేసీఆర్ నే నమ్ముకున్నాడు. 


ఈ సీన్ ని సింగిల్ పిక్ లో తనదైన స్టయిల్ లో చెప్పేశాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. చిరుతతో కలిసి వాకింగ్ చేస్తున్న నోముల భగత్ ఫోటో ఒకటి తన ట్విట్టర్ ఖాతాలో షేఋ చేశారు వర్మ. ‘వామ్మో… కేసీఆర్, కేటీఆర్‌లు టైగర్‌, సింహాలు అని మనకు తెలుసు. కానీ, అభ్యర్థి నోముల భగత్ చిరుత పులిని వాకింగ్‌కి తీసుకెళ్తుండడం నాకు నచ్చింది. ఒకవేళ నాకే కనుక నాగార్జున సాగర్‌ ఎన్నికల్లో ఓటు వేసే ఛాన్స్ ఉంటే 17న నా ఓటు ఇతనికే వేసేవాణ్ని” అని వర్మ రాసుకొచ్చారు. ఎదురుగా జానారెడ్డి లాంటి సీనియర్ నేత ఉన్నా.. నోముల భగత్ వెనక ఉన్నది కేసీఆర్, కేటీఆర్ లు .. ఆయన గెలుపు ఖాయమని చెప్పేశారు అన్నమాట. 

The candidate @BagathNomula says “VOTE FOR US, that is ME and TRS —WE WILL ROAR in NAGARJUNA SAGAR byelection and no other party can DAM us” —and me saying Not in world history I saw a candidate campaigning with a chained CHEETAH 😘😍💐💃 Hats off to #KCR and ⁦@KTRTRSpic.twitter.com/d9Tpu8ebMa— Ram Gopal Varma (@RGVzoomin) April 2, 2021