‘పుష్ప’రాజ్ ఎంట్రీ సీన్.. మాటల్లేవ్ !

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ సప్రైజ్ చేస్తాడనుకుంటే.. షాక్ ఇచ్చాడు. సుకుమార్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. తాజాగా ఈ సినిమా నుంచి  #PreludeofPushparaj పేరిట చిన్ని పీస్ ని వదిలారు. అది సింహం వేటని తలపించింది. ‘గంధం చెక్క చెట్టు వ్యూతో షాట్.. దట్టమైన అడవి.. ఫట్ మని పరుగెడుతున్న వ్యక్తి.. వెనక్కి చేతులతో బేడీలు.. వేటాడుతూ వెనక్కి తిరిగి గర్జించిన షాట్.. ‘ అబ్బో అదిరిపోయింది. ఈ సింగిల్ సీన్ తో చెప్పేయొచ్చు పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ అని. ఆ రేంజ్ లో పుష్ప ప్రీ లుక్ ని వదిలారు. ఇక ఈ నెల 7న పుష్పరాజ్ ని ప్రేక్షకులకి పరిచయం చేయనున్నారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప తెరకెక్కుతోంది. ఇందులో ఎర్రచందనం దుంగలని అక్రమంగా రవాణా చేసే లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నారు. ఆయనకి జంటగా రష్మిక మందన కనిపించనున్నారు. ఇక ఓ ఐటమ్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీని తీసుకోనున్నట్టు సమాచారమ్. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది.