తెలంగాణలో జగనన్నకు షాక్

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారు వైఎస్ షర్మిల. ఈ నెల 9న పార్టీని ప్రకటించనున్నారు. దీనిపై కొన్నాళ్లుగా కసరత్తులు చేస్తున్నారు. జిల్లాల వారీగా వైఎస్ఆర్ అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే షర్మిల పార్టీకి.. ఆమె అన్నయ్య, ఏపీ సీఎం జగన్ మద్దతు లేదనే ప్రచారం జరుగుతోంది. జగన్ పట్టించుకోకపోవడం వలనే షర్మిల పొలిటికల్ ఎంట్రీ  ఇస్తున్నారు.

తెలంగాణలో పార్టీ పెట్టి.. దాన్ని ఏపీలోకి విస్తరించనున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఇదే నిజమైతే జగనన్నకు షర్మిల తొలి షాక్ ఇచ్చినట్టే. తాజాగా తెలంగాణ వైకాపా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. జాతీయ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 2023 ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నుంచి పోటీ చేస్తానన్నారు. అయితే షర్మిల కోసమే గట్టు శ్రీకాంత్ రెడ్డి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. షర్మిల కొత్త పార్టీ పెట్టాక కూడా.. తెలంగాణలో వైకాపా ఉండటం బాగుండదని ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని చెప్పవచ్చు.