రేపే ‘వకీల్ సాబ్’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్స్.. షరతులు వర్థిస్తాయ్ !

‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్ డేట్ వచ్చేసింది. రేపే ఫంక్షన్. హైదరాబాద్ శిల్పాకళా వేదికగా ఫంక్షన్ జరగనుంది. ఈ మేరకు చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పరిమిత సంఖ్యలో అభిమానులని అనుమతి ఇస్తున్నామని తెలిపింది. పాసులు ఉన్నవారు మాత్రమే ఫంక్షన్ కి రావాలి. మాస్క్ ధరించని వారికి అనుమతి ఉండదని తెలిపారు. అభిమానులు అర్థం చేసుకొని సహకరించాలని కోరారు.


వాస్తవానికి.. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని ఘనంగా నిర్వహించాలని అనుకున్నారు. హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్ ని వేదికగా అనుకున్నారు. భారీ సంఖ్యలో అభిమానులు హారయ్యేలా ప్లాన్ చేద్దామనుకున్నారు. కానీ వకీల్ సాబ్ జోరుకు తెలంగాణ ప్రభుత్వం బ్రేకులు వేసింది. కరోనా విజృంభిస్తున్న వేళ… అనుమతులు నిరాకరించింది. దీంతో ప్రీ రిలీజ్ వేదికని శిల్పాకళా వేదికకి మార్చారు. చిత్రబృందం, అతికొద్ది మంది అభిమానుల మధ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించబోతున్నారు.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ తెరకెక్కింది. బాలీవుడ్ హిట్ ‘పింక్’కి రిమేక్ ఇది. ఇందులో బిగ్ బీ అమితాబ్ నటించిన పాత్రలో పవన్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. శృతిహాసన్, అంజలి, నివేదా థామస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు.