పవన్ నిర్మాత.. న్యూస్ ఛానెల్ పెట్టబోతున్నాడా ?

వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఏకంగా అరడజను సినిమాలని లైన్ లో పెట్టేసిన సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు,  ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రిమేక్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలని పవన్ పూర్తి చేయాల్సి ఉంది. ఇవీగాక.. ఒకట్రెండు సినిమాలకు కూడా పవన్ ఓకే చెప్పేశారు. వాటిపై అధికారిక ప్రకటనలు రాబోతున్నట్టు సమాచారమ్. ఇవీగాక.. పవన్ ఏకంగా 15 సినిమాలని ప్లాన్ చేశారనే కొత్త ప్రచారమూ మొదలైంది. అయితే ఇవి పవన్ హీరోగా కాదు. నిర్మాతగా.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ తో కలిసి పవన్ ఈ సినిమాలని నిర్మించనున్నారట. ఇందులో 6 చిన్న సినిమాలు, 6 మీడియం రేంజ్ సినిమాలు, మరో 3 భారీ బడ్జెట్ సినిమాలున్నాయని తెలుస్తొంది. భారీ బడ్జెట్ సినిమాలని స్టార్ హీరోలతో ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉంచితే.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ మీడియా రంగంలోకి రాబోతున్నాడట. ఆయన త్వరలోనే ఓ వార్తా ఛానల్ పెట్టబోతున్నారట. దానికి ఓ జాతీయ పార్టీ సపోర్ట్ కూడా ఉందని చెబుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా న్యూస్ ఛానల్స్ కు అనుమతులు ఇవ్వడం లేదు. అందుకే ఆల్రెడీ మార్కెట్లో ఉంటూ, రేటింగ్ లేక కిందామీద పడుతున్న మహా టీవీ న్యూస్ ఛానెల్ ను గంపగుత్తగా కొనేయాలని విశ్వప్రసాద్ ఆలోచన చేస్తున్నారట. బీజేపీ సహకారంతోనే విశ్వప్రసాద్, వార్తా ఛానెల్ పెట్టడానికి రెడీ అవుతున్నారని సమాచారమ్. అయితే మహా న్యూస్ ఛానల్ మహా బ్యాడ్ అనే ముద్రపడిపోయింది. అది ఎందరి చేతులు మారినా.. బాగుపడటం లేదు. అసలు ఆ ఛానెల్ పేరు.. ఆ ఆఫీసుకు వాస్తు.. వైగరా సరిగ్గా లేవనే టాక్ కూడా ఉంది.