‘తొలిప్రేమ100’తో వకీల్ సాబ్’కు లింకు.. భలే కుదిరింది !
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ఓ సినిమా చేయాలన్నది ప్రతి దర్శకుడు, నిర్మాణ కల. ఆ కలని దర్శకుడు హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’తో తీర్చుకున్నారు. ఇదే కలని నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ ‘వకీల్ సాబ్’తో తీర్చుకున్నారు. అయితే ఈ ముగ్గురికి.. ఎప్పటికైనా పవన్ తో సినిమా చేయాలన్న ఆలోచనకి బీజం పడింది మాత్రం ఓకే థియేటర్స్ ముందు. ఒకే కటౌట్.. ఒకే సినిమా. ఆ సినిమా ‘తొలిప్రేమ’. ఆ థియేటర్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య75MM.
ఆదివారం జరిగిన వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ముందుగా మాట్లాడిన దర్శకుడు హరీష్ శంఖర్.. ‘తొలిప్రేమ’ 100 డేస్ స్పెషల్ షోస్ ని సంధ్య థియేటర్ లో వేశారు. అప్పుడు.. థియేటర్ ముందు ఉన్న కటౌట్ ని చూసి.. ఎప్పటికైనా ఈ హీరోతో సినిమా చేయాలని డిసైడ్ అయ్యా. అదే షోకి వచ్చిన ఓ డిస్ట్రిబ్యూటర్.. నిర్మాతగా మారితే.. ఎప్పటికైనా పవన్ తో సినిమా చేయాలని అనుకున్నాడు. ఆ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు. నేను గబ్బర్ సింగ్ తో నా కోరిక తీర్చుకున్నా. ఇప్పుడు దిల్ రాజు వకీల్ సాబ్ తో తన చిరకాల కోరిక తీర్చుకున్నారని చెప్పారు. ఆ తర్వాత మాట్లాడిన దిల్ రాజు.. పవన్ తో సినిమా చేయాలన్నది నా 22యేళ్ల కల. ఆ కల ఇన్నాళ్లకి తీరినందుకు సంతోషంగా ఉందన్నారు.
ఇక వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ కి కూడా తొలిప్రేమ100 డేస్ షోతో లింకు ఉందని చెప్పాడు. హరీష్ శంకర్, దిల్ రాజు చూసిన తొలిప్రేమ100డేస్ స్పెషల్ షోలో.. ఆ రోజు నేను వున్నా. ఆ రోజు తొలిప్రేమ సినిమాని వరుసగా నాలుగు షోస్ చూశానని చెప్పారు. ఇలా.. సంధ్య థియేటర్స్ లో తొలిప్రేమ100 డేస్ స్పెషల్ షో చూసిన ముగ్గురు తన కోరికని తీర్చుకున్నారు. పవన్ తో సినిమా చేశారు. మన సంకల్పం గట్టిది అయితే.. అది తప్పక నెరవేరుతుంది అంటే.. ఇదేనేమో.. !