సాగర్ ని సీరియస్ గా తీసుకోని భాజాపా, తెరాస.. ఎందుకంటే ?
నాగార్జున సాగర్ ఉప ఎన్నికని భాజాపా, తెరాస పార్టీలు సీరియస్ గా తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సాగర్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా.. ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఉన్నారు. ఇక తెరాస నుంచి నోముల నరసింహయ్య తనయుడు నోముల భగత్, భాజపా అభ్యర్థిగా రవి కుమార్ ఉన్నాయి. అయితే ఇక్కడ గెలుపు జానాదే అని ప్రత్యర్థులు ముందే ఫిక్సయినట్టు ఉన్నారు.
ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల కోసం కేంద్ర పెద్దలని రంగంలోకి దింపింది భాజాపా. కేంద్ర హోమంత్రి అమిత్ షా వచ్చి ప్రచారం చేశారు. అయితే సాగర్ ప్రచారాన్ని మాత్రం తెలంగాణ భాజాపా సీరియస్ గా తీసుకోలేదు. కేంద్రం పెద్దలు రావడం పక్కనపెడితే.. రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలు, మాటకారులు ప్రచారం పాల్గొనడం లేదు. పైగా తెలంగాణ భాజాపా నేతలు తిరుపతి వెళ్లి అక్కడ ప్రచారం చేస్తున్నారు.
సాగర్ ని తెరాస లైట్ తీసుకోవడానికి కారణం.. జానారెడ్దిపై ఉన్న గౌరవమే కారణంగా కనిపిస్తోంది. ఎందుకంటే? తెలంగాణ ఉద్యమ సమయంలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా జానారెడ్డి కేసీఆర్ కు సహకరించారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కోసమే సాగర్ ఉప ఎన్నికని గులాభి పార్టీ లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. మరీ.. భాజాపా లైట్ తీసుకోవడం వెనక కారణం ఏంటీ అంటే.. ? అక్కడ భాజాపాకు గెలుపు అవకాశాల్లేవ్.
ఒకవేళ భాజాపా గట్టిగా ప్రయత్నిస్తే.. తెరాసకు గెలుపు అవకాశాలు మెరుగు అయ్యేలా ఉన్నాయ్. అది ఇష్టంలేని భాజాపా సాగర్ ప్రచారాన్ని కాస్త లైట్ గా తీసుకుందని చెప్పుకుంటున్నారు. ఇదీగాక.. బరిలో ఉన్న రవికుమార్ ధనవంతుడు కాదు. రాష్ట్ర స్థాయి నేతలని తీసుకొచ్చి.. వారి, వారి అనుచరుల ఖర్చులని బరించే రేంజ్ లేదు. అందుకే.. సాగర్ లో భాజాపా ప్రచారం.. దుబ్బాక, గ్రేటర్ ఉప ఎన్నికని తలపించడం లేదని చెప్పుకొంటున్నారు. ఈ నేపథ్యంలో సాగర్ లో జానారెడ్డి గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నారు.