కరోనా కొత్త గైడ్ లైన్స్.. కరోనా వచ్చిన వ్యక్తి ఇంటిని సీజ్ !
దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. గతంలో కంటే వేగంగా కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజులోనే లక్షకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయ్. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఐదు అంశాల దృష్టి సారిస్తూ.. కరోనాని కట్టడి చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనిపై ఆదివారమే కేంద్రం ప్రకటన చేసింది.
తాజాగా కరోనా కట్టడికి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. పాజిటివ్‌గా తేలిన వ్యక్తి నివసిస్తోన్న ఇంటి చుట్టూ 25 మీటర్ల ప్రాంతాన్ని సీల్ చేయాలని పేర్కొంది. ఒకవేళ అదే ప్రాంతంలో మరోవ్యక్తికి కూడా వైరస్ సోకితే, సీల్ చేసే ప్రాంతం పరిధి 50 మీటర్లకు పెరుగుతుంది. ఆ మార్గదర్శకాల ప్రకారం 25 మీటర్ల పరిధిలోకి కనీసం 20 ఇళ్లు, 50 మీటర్ల పరిధిలోకి 60 ఇళ్లు వస్తాయని పేర్కొంది.
అలాగే చివరి పాజిటివ్ కేసు వెలుగు చూసిన దగ్గరి నుంచి 14 రోజుల పాటు ఆ ప్రాంతాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్‌గా పరిగణిస్తారు. ఆ కాలంలో ఒక్క కేసు కూడా లేకపోతే ఆ ప్రాంతం కంటైన్మెంట్ జోన్ నుంచి బయట పడుతుంది. యూపీ మాదిరిగా ఇతర రాష్ట్రాలు సొంతంగా కరోనా గైడ్ లైన్స్ ని రూపొందించుకొని.. మహమ్మారిని కట్టడి చేసే కసరత్తులు ప్రారంభిస్తున్నాయి. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే తరహా కొత్త గైడ్ లైన్స్ ని విడుదల చేసే అవకాశాలున్నాయి.