లెవన్త్ అవర్’ ట్రైలర్ టాక్

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మిల్కీ బ్యూటీ తమన్నా పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లెవన్త్ అవర్’.  ప్రముఖ తెలుగు ఓటీటీ యాప్ ‘ఆహా’లో ఏప్రిల్‌ 9న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. అనగనగా.. ఓ అడవి అంటూ.. కూతురుకి అమ్మ చెబుతున్న కథగా ట్రైలర్ ని కట్ చేశారు.

ఈ కథతో సినిమాలోని పాత్రలు.. వాటి స్వభావం.. స్టోరీ లైన్ ని చెప్పే ప్రయత్నం చేశారు. పీకల్లోతు ఇరుక్కున్న తమన్నా.. ఎవరు కూడా సహాయం చేయని స్థితిలో తనకు తాను ఎలా భయటపడింది ? అనే స్టోరీ లైన్ తో లెవన్త్ అవర్ తెరకెక్కినట్టు ట్రైలర్ ని చూస్తే అర్థమవుతోంది. సినిమాలు అంచనాలు పెరిగేలా ట్రైలర్ ని ఆసక్తిగా కట్ చేశారు.