Akhil5 అప్ డేటు వచ్చేసింది !

అక్కినేని యంగ్ హీరో అక్కిల్ అక్కినేని ప్రస్తుతం ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. అఖిల్ నటిస్తున్న నాల్గో సినిమా ఇది. ఇక అఖిల్ ఐదో సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా అప్ డేటు ఇచ్చారు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈ నెల 8న ఉదయం 9:09 నిమిషాలకు ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్టు ఓ పోస్టర్ విడుదల చేశారు. రెండు గన్స్ మధ్య బుల్లెట్ తో పోస్టర్ ని ఆసక్తిగా డిజైన్ చేశారు.


ఇక అఖిల్ నాల్గో సినిమా ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. అఖిల్ కి జంటగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 నిర్మిస్తోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి ఏ జిందగీ.. మెలోడీ సాంగ్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు మంచి స్పందన వస్తోంది.

‘𝐀’ is Ready to KILL &
‘𝐒’ is Ready to STUN 🤟#Akhil5FirstLook Blast on April 8th at 9:09 AM 💥@AkhilAkkineni8 @AnilSunkara1 @AKentsOfficial #S2C#Akhil5 pic.twitter.com/tXRnc7Skog— SurenderReddy (@DirSurender) April 6, 2021