IPLLలో హ్యాట్రిక్ కోరిక తీరుతుందా ?
ఐపీఎల్ లో హ్యాట్రిక్ టైటిల్స్ ని చెన్నై తృటిలో మిస్సయింది. 2010, 2011 సీజన్లలో వరుసగా రెండేళ్లు చెన్నై టైటిల్ సాధించింది. అయితే 2013లోనూ చెన్నై ఫైనల్ కి చేరింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో ధోని సేనకు ముంబై షాక్ ఇచ్చింది. ఆ యేడాది ముంబై విజేతగా నిలిచింది. దీంతో చెన్నై హ్యాట్రిక్ టైటిల్స్ ని మిస్సయింది.
అయితే ఐపీఎల్లో తొలిసారి హ్యాట్రిక్ టైటిల్ సాధించిన జట్టుగా అవతరించాడిని ముంబైకి ఛాన్స్ ఉంది. 2020, 2021 సీజన్లలో వరుసగా రెండేళ్లు ముంబై టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా ముంబై కప్ కొడితే.. హ్యాట్రిక్ కొట్టినట్టు అవుతోంది. ఆ కోరిక తీరాలని ముంబై ఇండియన్స్ అభిమానులు ఆశపడుతున్నారు. రోహిత్ సేనకు ఆ సత్తా ఉందని చెబుతున్నారు. ముంబై హ్యాట్రిక్ కొడితే చూడాలని మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ అన్నారు. ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్యూలో పార్థివ్ మాట్లాడారు.
‘ఐపీఎల్ అంటేనే ఎంటర్టైన్మెంట్. ఆటగాళ్లంతా తమ ప్రతిభని నిరూపించుకొనే వేదిక. కోహ్లీ, గేల్‌తో పాటు ఎంతోమంది ఆటగాళ్లు ఎలా ఆడారో దగ్గరుండి చూశాను. అయితే, ఇప్పటివరకూ నమోదు కాని ఓ గొప్ప రికార్డును చూడాలనుకుంటున్నా. అదేంటంటే ఏదైనా జట్టు హ్యాట్రిక్ విజయాలు సాధించడం. ఈసారి ముంబయి ఇండియన్స్‌కు ఆ అవకాశం ఉంది. అది చూడాలనుకుంటున్నా’ అని పార్థివ్ చెప్పాడు.