ఓటు హక్కు నివియోగించుకోవాలంటూ.. నాలుగు బాషల్లో ప్రధాని ట్విట్లు

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఒకే దశలో ఎన్నికల పోలింగ్‌ ఈ ఉదయం ప్రారంభమైంది. మరోవైపు అసోం, బెంగాల్‌ శాసనసభలకు మూడో దశ పోలింగ్‌ జరుగుతోంది. నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం నుంచి మొత్తం 475 స్థానాల్లో 20 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఈ నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ప్రధాని మోదీ ఓటర్లును అభ్యర్థించారు. బెంగాలీ, మళయాళం, తమిళం, ఆంగ్లంలో ట్వీట్లు చేస్తూ ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. రికార్డు స్థాయిలో ఓటు శాతం నమోదు కావాలని, ముఖ్యంగా యువత ఓటు వేసేందుకు ముందుకు రావాలని పేర్కొన్నారు.