ఈసారి కమర్షియల్’గా వర్కవుట్ అయింది !

మాస్ మహారాజా రవితేజతో మారుతి సినిమా దాదాపు ఓకే అయింది. అయితే కమర్షియల్ గా ఈ సినిమా వర్కవుట్ కాలేదు. ముందుకు సాగలేదు. రెమ్యూనరేషన్ దగ్గర రవితేజ తగ్గకపోవడంతో.. ఈ సినిమా క్యాన్సిల్ అయింది. అదే కథని గోపీచంద్ తో తీస్తున్నాడు మారుతి. అదే పక్కా కమర్షియల్. అయితే లెటెస్ట్ న్యూస్ ఏంటంటే ?


రవితేజ నుంచి మారుతికి పులుపొచ్చింది. వీరిద్దరి మధ్య ఢీల్ ఓకే అయింది. పక్కా కమర్షియల్ పూర్తికాగానే రవితేజతో మారుతి సినిమా చేయనున్నారు. మరీ.. ఈ సినిమాకు నిర్మాత ఎవరు? ఈ సారి కమర్షియల్ గా ఎలా వర్కవుట్ అయింది ? అనే వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఈ యేడాది క్రాక్ తో హిట్ కొట్టిన రవితేజ.. ప్రస్తుతం ఖిలాడి సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.