RCBకి గుడ్ న్యూస్.. పడిక్కల్ కు కరోనా నెగటివ్ !

ఐపీఎల్ 14 ప్రారంభానికి ముందు ఆటగాళ్లు కరోనా బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు, స్టేడియం సిబ్బంది కరోనా బారినపడ్డారు. #RCB యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ కు పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పడిక్కల్ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా చేసిన టెస్టులో ఆయన నెగటివ్ వచ్చింది. 

గత యేడాది ఐపీఎల్‌లో బెంగళూరు తరఫున రాణించిన పడిక్కల్‌ ఈ ఏడాది సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ, విజయ్‌ హజారె వన్డే టోర్నీలో మెరిశాడు. విజయ్‌ హజారెలో 7 మ్యాచ్‌ల్లో 147.40 సగటుతో 737 పరుగులు రాబట్టాడు. వరుసగా 4 శతకాలు, 3 అర్ధ సెంచరీలు సాధించాడు. అయితే తాను కోహ్లీలా మారాలనుకుంటున్నానని పడిక్కల్ అంటున్నారు.

బ్యాటింగ్‌లో చాలా పరిణతి సాధించా. ఇన్నింగ్స్‌ను నిర్మించడం.. భారీగా పరుగులు రాబట్టడం నేర్చుకున్నా. విరాట్, డివిలియర్స్‌లతో కలిసి ఆడటం గొప్ప గౌరవం. కోహ్లి, డివిలియర్స్‌ల నుంచి ప్రతిరోజూ ఒక కొత్త విషయం నేర్చుకున్నా. ఆట పట్ల కోహ్లి అంకితభావం, సత్తాచాటాలన్న పట్టుదల అద్భుతం. అతనికి స్ఫూర్తినివ్వడానికి మరొకరు అవసరం లేదన్నాడు.. ఈ యువ ఓపెనర్.