#RRR లాభాలు రూ. 450కోట్లు ?

ఓ సినిమాకు పది కోట్లు, ఇరవై కోట్లు మిగిలితే.. ఆ సినిమా నిర్మాత ఆనందానికి అవధులుండవ్. ఇలాంటివి జరగడం కూడా చాలా అరుదు. అలాంటిది.. ఓ సినిమా ఏకంగా రూ. 450కోట్ల లాభాలు తీసుకొస్తే.. ఏమనాలి. అది దర్శకధీరుడి రాజమౌళి సినిమా అనాలి. అవునూ.. #RRR లాభాల లెక్క అప్పుడే తేలుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఫ్రాఫిట్ నే సుమారు 450 కోట్ల మేరకు వుంటుందని సమాచారమ్. ఈ సినిమా నాన్ థియేటర్ హక్కులు, ఆల్ లాంగ్వేజెస్, ప్లస్ డిజిటల్ తదితర హక్కులను టోకున 400 కోట్లకు కాస్త ఇటు అటుగా విక్రయించేసారు. 


ఆర్ఆర్ఆర్ కథానాయకులు ఎన్ టీఆర్, రామ్ చరణ్ లకు చెరో రూ. 35కోట్ల పారితోషికం ఇవ్వాలి. ఇతర నటీనటుల పారితోషికాలు.. సినిమాకు పెట్టిన అన్నీ ఖర్చులు పోనూ.. రూ. 450కోట్ల లాభాలు మిగలనున్నాయట. ఇందులో రాజమౌళికి సగం. నిర్మాత దానయ్య కు సగం అన్నమాట. అంటే.. ఎంతకాదన్న.. చెరో రూ. 200కోట్లకుపైగా లాభాలు మిగలనున్నాయి అన్నమాట. ఈ లెక్కన ఆర్ ఆర్ ఆర్ కోట్లు పండిస్తున్నట్టే. రాజమౌళి చేస్తున్నది కోట్ల వ్యవసాయం అని చెప్పవచ్చు. 


 రాజమౌళి దర్శకత్వంలో ఎన్ టీఆర్, రామ్ చరణ్ కథానాయలుగా నటిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.  బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రమిది. స్వాత్రంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల మధ్య గల ఓ కామన్ పాయింట్ ఆధారంగా దర్శకుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కథని రాసుకొన్నారు. ఇందులో కొమరంభీమ్ పాత్రలో తారక్.. ఆయనకి జంటగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్, ఆయనకి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సీత పాత్రలో నటిస్తున్నారు.