వకీల్ సాబ్.. ఆంధ్రలో అదనపు ఆటలు పడతాయా ?

వకీల్ సాబ్ కు తెలంగాణలో ఎలాంటి సమస్య లేదు. ఇక్కడ టికెట్ రేట్లు పెంచుకొనే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ బెనిఫిట్ షోస్ రేట్స్ భారీగా పెంచేసినట్టు తెలుస్తోంది. ఫ్యాన్స్ స్పెషల్ షోకి టికెట్ ధరని ఏకంగా రూ. 2000 నిర్ణయించారట. ఆ తర్వాత షోస్ కి కూడా రూ. 500 నుంచి 1500కి తగ్గకుండా అమ్ముతున్నారట. ఇక తొలివారం మొత్తం వకీల్ సాబ్ టికెట్ ధర రూ. 200కి తక్కువ దొరకని చెబుతున్నారు. దీంతో పేదలు తొలివారం వకీల్ సాబ్ ని చూసే అవకాశాలేవనే విమర్శలొస్తున్నాయ్.

ఇక ఏపీ విషయానికొస్తే.. అక్కడ టికెట్ రేట్లు పెంచుకొని అవకాశం లేదు. కాకపోతే ఆరు షోస్ వేసుకోవచ్చు. దానికి కూడా ప్రభుత్వం అనుమతి అవసరం. మరీ.. వకీల్ సాబ్ అదనపు షోస్ కి జగన్ ప్రభుత్వం అనుమతిని ఇస్తుందా ? అంటే… ఈజీగా ఇస్తుందని చెబుతున్నారు. సీఎం జగన్ కు పవన్ కల్యాణ్ రాజకీయ ప్రత్యర్థి. కానీ.. అలాంటివేవి జగన్ పట్టించుకోరు అని చెబుతున్నారు. ఇక వకీల్ సాబ్ అదనపు ఆటల.. అనుమతిని సాధించే బాధ్యతను వైకాపా నాయకుడు, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పై పెట్టారని తెలుస్తోంది.

నిర్మాత దిల్ రాజకు వైకాపాతో మంచి సంబంధాలు వున్నాయి. పైగా వైకాపా ఎమ్మెల్యేలతో కుటుంబ బాంధవ్యాలు కూడా వున్నాయి. లాంటి నేపథ్యంలో ఆంధ్రలో అదనపు ఆటలకు జగన్ నుంచి అనుమతి సంపాదించే బాధ్యతను ఆయన తనకు బాగా సన్నిహితుడు అయిన వైవి సుబ్బారెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది. ఆంధ్రలో వకీల్ సాబ్ అదనపు షోస్ కి అనుమతులు వస్తే.. అది డిస్ట్రిబ్యూటర్స్ కి లాభించనుంది.