జగన్ విష్ణువు.. భాజపా నేతల సౌండ్ లేదేంటీ.. !?
ఏపీ సీఎం జగన్ ను తితిదే ప్రధానార్చకులు రమణ దీక్షితులు విష్ణుమూర్తితో పోల్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై వివాదం చెలరేగం ఖాయం అనుకున్నారంతా. ముఖ్యంగా ఏపీ భాజాపా నేతలు రమణ దీక్షితుల మాటలని తీవ్రంగా ఖండిస్తారు అనుకున్నారు. ఎందుకంటే ? ఏపీలో జోరుగా జరుగుతున్న మత మార్పిడిల వెనక జగన్ ప్రభుత్వం ఉందని భాజాపా నేతలు ఆరోపణలు చేశారు. అంతేకాదు.. ఏపీలోని దేవాలయాలపై వరుసగా జరిగిన దాడుల వెనక ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందనే ఆరోపణలు కూడా చేశారు. ఇక ఏపీ సీఎం జగన్ ఎప్పుడు తిరుమల వచ్చిన వివాదమే. ఆయన బుక్ లో సైన్ చేసి రావాలి.. ఏ మతం అన్నది స్పష్టం చేయాలనే పాయింట్ ని కమలం నేతలు లాగుతారు.
అలాంటి కమల నేతలు .. ఇప్పుడు జగన్ ని విష్ణువు తో పోల్చిన సలైంట్ గా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. అయితే ఈ పోలికపై భాజాపా పూర్తిగా సలైంట్ గా లేదు. లేటుగా అయిన స్పందించింది. జగన్ ని విష్ణువుతో పోల్చడం బాధాకరమని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి అన్నారు. బుధవారం నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రమణ దీక్షితుల వ్యాఖ్యలు తితిదే పవిత్రతకు భంగం కలిగించేలా ఉన్నాయన్నారు. తితిదేలో అన్యమతస్తులు లేరని అనడం దారుణమన్నారు. రాజకీయంగా మాట్లాడాలనుకుంటే ప్రధాన అర్చకుడి పదవికి రాజీనామా చేయాలని సూచించారు. అయితే ఈ మేటరుపై భాజపా ఇంత కూల్ గా, ఇంత లేటుగా స్పందించడం ఆశ్చర్యాన్ని కలిగించిదే.. ! మరోవైపు రమణ దీక్షితులు పోలిక సీఎం జగన్ పై పడిన హిందు వ్యతిరేకి అనే ముద్రని కొంత వరకు తుడిపేసేలా కనిపిస్తోంది.