చరణ్’తో సినిమా.. అనుమప షాకింగ్ రిప్లై !
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సడెన్ సప్రైజ్ ఇచ్చింది. షాకింగ్ రిప్లై కూడా ఇచ్చింది. అసలు విషయం ఏంటంటే.. ? ఈరోజు అనుపమకు బోర్ కొట్టినట్టుంది. వెంటనే అభిమానులని లైన్ లో పెట్టేసింది. తనకు బోర్ కొడుతోందని, ఎవరైనా క్రేజీ క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేస్తానని ఊరించింది. వెంటనే కొంతమంది లైన్లోకి వచ్చారు.
క్రేజ్ క్వశన్స్ తో అనుపమని మూడులోకి తీసుకొచ్చారు. అయితే ఓ అభిమాని రామ్ చరణ్ తో మీ కాంబో చూడొచ్చా ? అని ప్రశ్నించాడు. అప్పటివరకు సరదాగా సమాధానాలిచ్చిన అనుపమ కాస్త మూడ్-అవుట్ అయింది. అదో రకంగా పక్కకు చూస్తూ దిగిన సెల్ఫీని పోస్ట్ చేసి ఊరుకుంది. దానిపై స్పందించడం ఇష్టం లేదన్నట్టుంది ఆ సెల్ఫీ.
రామ్ చరణ్ రంగస్థలం సినిమాకు మొదట అనుపను అనుకున్నారు. ఆ తర్వాత సమంతని తీసుకున్నారు. ఆ రకంగా అనుపమ ఓ బ్లాక్ బస్టర్ హిట్ మిస్సయింది. అది మనసులో పెట్టుకొని.. రామ్ చరణ్ పై పెద్దగా మోజులేదు అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్స్ పెట్టేసింది. బహుశా.. రంగస్థలం టైమ్ లో అనుపమ, సమంత అనే ఆప్షన్ వచ్చినప్పుడు.. చరణ్ సామ్ ని సెలక్ట్ చేసుకున్నాడేమో. అదే అనుపమ మంటకు కారణమై ఉంటుందేమో. అది ఇప్పటి వరకు చల్లారలేదని.. ఈ అమ్మడి తాజా ఎక్స్ ప్రెషన్ చూస్తే అర్థమవుతోంది.
• You & #Ramcharan Combo Chudocha..@anupamahere Darling Reply 🤩❤❤ #AnupamaParameswaran pic.twitter.com/8TLqpsx15C— ᴘ ʀ ᴀ ᴠ ᴇ ᴇ ɴ ⚪ (@AlwaysPraveen96) April 7, 2021