మ్యాక్స్‌వెల్’కు ఇదే ఆఖరు ఐపీఎల్

ఆసీస్ ఆల్ రౌండర్ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ ఎంతటి విధ్వంసకర ఆటగాడు అన్నది అందరికీ తెలిసిందే. సింగిల్ తీసినంత ఈజీగా సిక్సర్స్ కొట్టేస్తాడు. చూస్తుండగానే మ్యాచ్ ని చేతుల్లో నుంచి లాగేసుకుపోతాడు. అయితే ఐపీఎల్ లో మ్యాక్సీ పెద్దగా రాణించింది లేదు. అందుకే అతడిని ఫ్రాంచైజీలు వదిలేస్తున్నాయి.

పంజాబ్‌ను 2014లో ఫైనల్‌కు తీసుకెళ్లిన మాక్సీ ఆ తర్వాత ఎప్పుడూ ఆ స్థాయిలో ఆడలేదు. ముంబయి, దిల్లీ వంటి జట్లకు మారాడు. వాళ్లు వదిలేయడంతో గతేడాది మళ్లీ పంజాబ్‌కే ఆడినా ఒక్క సిక్సరూ బాదలేదు. ఆస్ట్రేలియా తరఫున విధ్వంసం సృష్టించిన అతడిని ఈ సారి బెంగళూరు భారీ ధరపెట్టి కొనుగోలు చేయడం గమనార్హం. అయితే ఈసారి అతడు రాణించకపోతే.. ఇదే ఆఖరు ఐపీఎల్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.