చెన్‌బౌన్స్ కేసు.. రాధికా శరత్‌కుమార్ దంపతులకు యేడాది శిక్ష !
చెన్నైలోని సైదాపేట స్పెషల్ కోర్టు రాధికా శరత్‌కుమార్ దంపతులు ఏడాది శిక్ష విధించింది. చెన్‌బౌన్స్ కేసులో ఈ శిక్ష పడింది. శరత్ కుమార్, రాధిక, మరో నిర్మాత లిస్టిన్ స్టీఫెన్ పలు సినిమాలను సంయుక్తంగా నిర్మించారు. 2015లో ‘ఇదు ఎన్న మాయం’ సినిమా కోసం రాధికా, శరత్‌కుమార్‌లు రేడియంట్ గ్రూప్ అనే కంపెనీ నుంచి భారీ మొత్తంలో అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చాలని పలుమార్లు అడిగినా ప్రయోజనం లేకపోయింది.
మరోవైపు రాధికా దంపతులు ఇచ్చిన చెక్ కాస్త బౌన్స్ అయింది. దీంతో సదరు సంస్థ 2018లో కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో 2019లో అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. మూడేళ్ల పాటు సుదీర్ఘ విచారణ సాగింది. తాజాగా చెన్నై స్పెషల్ కోర్టు ఈ దంపతులకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. శరత్‌కుమార్ తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు. తెలుగులోనూ పలు సినిమాల్లో నటించారు. ఇక రాధిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవితో అత్యధిక సినిమాలు చేసిన హీరోయిన్ గా ఆమె పేరిట రికార్డ్ ఉంది.