గులాబి కళ్ళు రెండు ముల్లు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే

పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేసే హీరోయిన్ల లిస్టులో మెగా హీరోయిన్ నిహారిక చేరిపోయింది. పెళ్లి త‌ర్వాత వెబ్ సిరీస్‌లో న‌టించేందుకు నిహారిక గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇటీవ‌ల ఓ సినిమాకు కూడా అంగీక‌రించిన‌ట్టు స‌మాచారమ్.

ఈ ఆనందంలో తాజాగా ఓ ఫోటో షూట్ చేసింది నిహారిక. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.ఈ ఫోటోలకు అచ్చ తెలుగులో కామెంట్ పెట్టిందామె. ‘గులాబీ, దుస్తులు, న‌గ‌లు, ఛాయాచిత్ర క‌ళాకారుడు, క‌ర్త మ‌రియు క‌ర్మ‌, స‌హాయ‌కురాలు’ అని రాసుకొచ్చింది.

ఈ పోస్ట్ పై నిహారిక భర్త చైతన్య రొమాంటిక్‌గా కామెంట్ చేశాడు. ‘గులాబి కళ్ళు రెండు ముల్లు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే’ అని అంటూ నిహారికపై తన మ‌న‌సులో దాగిన ప్రేమ‌ను చాటుకున్నారు. ఇప్పుడు.. ఈ రొమాంట్ కామెంట్ వైరల్ అవుతోంది. దీనిపై మెగా కుటుంబ సభ్యులు కూడా స్పందిస్తున్నారు. కొత్త జంట ప్రేమపై సటైర్స్ వదులుతున్నారు.