ఏపీలో ఆ మూడు పార్టీలు ఒక్కటే

ఏపీలో అధికార వైసీపీపై భాజపా-జనసేన కలిసి పోరాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జరుగుతున్న తిరుపతి ఉప ఎన్నికలోనూ వైకాపాని ఓడించేందుకు భాజాపా-జనసేన కూటమి గట్టిగా ప్రయత్నిస్తోంది. ఫలితం ఏమవుతుంది ? అన్నది పక్కన పెడితే.. ఈ కూటమికి తెదేపా కూడా సపోర్ట్ చేస్తుందని వైకాపా ఆరోపిస్తోంది. తిరుపతి బరిలో తెదేపా కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అది తూ.. తూ మంత్రమే అంటున్నాయి వైకాపా శ్రేణులు. స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించినట్లు చెప్పిన తెదేపా.. కొన్ని చోట్ల భాజపాకు లోపాయికారిగా సహాయపడుతోందని వైకాపా ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

అంతేకాదు..  భాజపా-జనసేన కూటమిలో చేరేందుకు తెదేపా పలు రకాలుగా ప్రయత్నాలు సాగిస్తోందని చెప్పారు. జగన్‌ను ఎదుర్కోలేక ఆ మూడు పార్టీలు జట్టు కట్టాలని భావిస్తున్నాయన్నారు. ఇదే నిజమైతే.. ఏపీలో అధికార వైసీపీపై మూడు పార్టీలు (భాజాపా-జనసేన-తెదేపా) ఒక్కటై దాడి చేస్తున్నాయని చెప్పవచ్చు. వాస్తవానికి.. భాజాపాతో జతకట్టేందుకు చంద్రబాబు చాన్నాళ్ల నుంచి ప్రయత్నిస్తున్నాడు. కానీ బీజేపీ మాత్రం ఆయన్ని దగ్గరికి రానివ్వడం లేదు. కమలం పార్టీ పవన్ మాత్రమే నమ్ముకుంటోంది.