వకీల్ సాబ్ సెకండాఫ్’లో వచ్చే సప్రైజ్.. ఇదే !

సెకాంఢాఫ్ లో ఓ సప్రైజ్ ఉంటుందని వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ ఊరిస్తున్న సంగతి తెలిసిందే. అలాగని ఎక్కువ ఊహించుకోవద్దని చెబుతున్నాడు. దాంతో.. ఆ సప్రైజ్ ఏమై ఉంటుంది ? అని తెలుసుకొనేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడీ.. ఈ సస్పైన్స్ ఏంటన్నది బయటికి లీకైంది. 


వకీల్ సాబ్ ఆరంభంలో వచ్చే ‘మగువ..మగువా’ సాంగ్  మళ్లీ సెకండాఫ్ లో వస్తుంది. అయితే ఇప్పటి వరకు వైరల్ అయిన మేల్ వెర్షన్ కాదు. ఫిమేల్ వెర్షన్. ఇది ఇంకా బయటకు రాలేదు. దీన్ని సెకండాఫ్ లో ప్లే చేస్తారు. అదే సర్ప్రయిజ్ అని తెలిసింది.
భారీ అంచనాల మధ్య ఎల్లుండే వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇప్పటికే టాలీవుడ్ లో వకీల్ సాబ్ ఫీవర్ పీక్స్ కి చేరింది. వకీల్ సాబ్ టికెట్స్ దక్కించుకోవడానికి అభిమానులు చేయని ప్రయత్నాల్లేవ్. ఇప్పటికే ఆన్ లైన్ టికెట్ బుక్కింగ్స్ కూడా మొదలైపోయాయ్. అయిపోయాయ్ కూడా. ఫ్యాన్స్ స్పెషల్ షో, బెనిఫిట్ షోస్ కోసం టికెట్ ధరలు రూ. 500 నుంచి 2000 వరకు పలుకుతున్నట్టు సమాచారమ్.

ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ హిట్ పింక్ కి రిమేక్ ఇది. ఇందులో బిగ్ బీ అమితాబ్ నటించిన పాత్రలో పవన్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో శృతిహాసన్, అంజలి, నివేదా థామస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు.