కోలీవుడ్ లో మళ్లీ 50శాతం ఆక్యుపెన్సీ నిబంధన

ఎన్నికలు ముగిసిన వెంటనే తమిళనాడు ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు షాక్ ఇచ్చింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో థియేటర్స్ లో 50శాతం ఆక్యుపెన్సీ నిబంధనని విధించింది. గత యేడాది కరోనా వెలుగులోకి రాగానే దేశ వ్యాప్తంగా థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. దాదాపు ఆర్నేళ్ల తర్వాత థియేటర్స్ తెరచుకున్నాయి. మొదట 50శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్స్ రన్ అయ్యాయ్. ఆ తర్వాత వందశాతం ఆక్యుపెన్సీకి అనుమతులు వచ్చాయి. 


ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమలో సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వారానికి మూడ్నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తున్నాయి. ఇంతలో దేశంలో సెకండ్ వేవ్ మొదలైంది. కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ ప్రభావం మరోసారి చిత్రపరిశ్రమపై పడేలా ఉంది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం థియేటర్స్ లో 50శాతం ఆక్యుపెన్సీ నిబంధనని విధించింది. దీంతో.. ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.