స్టయిలీష్ స్టార్.. ఇకపై ‘ఐకాన్’ స్టార్ !

స్టయిల్ కే స్టయిల్ నేర్పించే స్టయిల్ అల్లు అర్జున్ సొంతం. అందుకే ఆయన క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతోంది. రాష్ట్రాలు దాడుతోంది. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. బాలీవుడ్ కూడా బన్నీ స్టయిల్ కి ఫిదా అయిపోయింది. పుష్పతో తొలిసారి బన్నీ డైరెక్ట్ గా బాలీవుడ్ ప్రేక్షకులని పలకరించబోతున్నారు. ఈ నేపథ్యంలో స్టయిలీష్ స్టార్ కాస్త ‘ఐకాన్’ స్టార్ గా మారబోతున్నాడు. 

‘ఐకాన్ స్టార్’ బన్నీకి కూడా నచ్చింది. బుధవారం జరిగిన #IntroducingPushpaRaj కార్యక్రమంలో మాట్లాడిన బన్నీ.. స్టయిలీష్ స్టార్ గా ఉన్న తనని ‘ఐకాన్ స్టార్’ గా చేస్తున్నారు. ఆనందంగా ఉందన్నారు. సుకుమార్ దర్శకత్వంలో చేసిన తొలి సినిమా ‘ఆర్య’ తనని వెలుగులోకి తెచ్చింది. స్టయిలీష్ స్టార్ ని చేసింది. ఇప్పుడు సుక్కు డైరెక్షన్ లో వస్తున్న పుష్ప తనని ఐకాన్ స్టార్ గా చేసేలా ఉందన్నారు. ఐకాన్ స్టార్ కు బన్నీ అర్హుడు కూడా. సినిమా కోసం ఆయన పడే కష్టం.. ఆయనతో పాటు ఇతర హీరోలు ఎదగాలనే ఆయన మంచి మనసుకు ఎన్ని బిరుదులు ఇచ్చినా తక్కువే. 

ఇక బన్నీ హీరోగా ‘ఐకాన్’ సినిమా రావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాత ఈ సినిమా ఓకే అయింది. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఆ తర్వాత ఎలాంటి అప్ డేటు లేదు. దీంతో ఈ సినిమా క్యాన్సిల్ అయింది అనుకున్నారంతా. కానీ.. బుధవారం వకీల్ సాబ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న దిల్ రాజు.. ఐకాన్ పై క్లారిటీ ఇచ్చారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఐకాన్ సినిమా తీసుకొస్తాం అన్నారు. కాస్త ఆలస్యమైన ఐకాన్ ని తీసుకొస్తామని తెలిపారు.