పుష్పలో బన్నీ కనిపించడం లేదు

పుష్పలో బన్నీ కనిపించలేదనే కంప్లైట్స్ వస్తున్నాయ్. #IntroducingPushpaRaj వీడియో చూసిన చాలామంది ఈ కంప్లైట్ చేస్తున్నారు. ఎందుకంటే.. ? టీజర్ లో అసలు బన్నీ కనిపించలేదు. కేవలం పుష్పరాజ్ అనే పాత్ర మాత్రమే కనిపించింది. అంతలా బన్నీ ఆ పాత్రలో లీనమైపోయాడు. టీజర్ లోనే బన్నీ యాక్టింగ్ ఇలా ఉంటే.. ఇక సినిమాలో తగ్గేదేలె.. తన నటనతో బన్నీ షాక్ ఇవ్వడం ఖాయం. దానికి బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయం. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం గ్యారెంటీ. హిట్ తో పాటు.. బన్నీకి అవార్డులు వస్తాయ్.. రాసిపెట్టుకోండని చెప్పుకుంటున్నారు. ఇది బన్నీ అభిమానుల మాట కాదు. ఇతర హీరోల అభిమానుల మాట కూడా ఇదే.

#IntroducingPushpaRaj చూస్తే.. రెండు మూడు షాట్స్ షాక్ ఇస్తాయ్. బైక్ పై బన్నీ వచ్చే షాట్ మొదటిది అయితే.. తగ్గేదేలె.. అంటూ బన్నీ చెప్పిన షాట్ రెండోది. ఇక ఆఖరి షాక్ హైలైట్. ఇవీగాక.. బన్నీ కత్తితిప్పే షాట్ అదిరిపోయింది. నిజంగానే అక్కడ ఓ స్మగ్లింగ్ సాగుతోంది. ఓ స్మగ్లర్ అతి  కిరాతకంగా పోలీసులని ఎటాక్ చేస్తున్నాడు అన్నట్టుగా టీజర్ సాగింది. లెక్కల మాస్టర్ సుకుమార్.. తన క్రియేటివిటీ కనిపించేలా టీజర్ కట్ చేశాడు. సింగిల్ టీజర్ తోనే బ్లాక్ బస్టర్ హిట్ ని జేబుల్లో వేసుకున్న బన్నీ, సుకుమార్, పుష్ప చిత్రబృందానికి అభినందనలు. మా స్టయిలీష్ స్టార్ కాదు.. ఐకాన్ స్టార్  కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ టీస్ మిర్చి డాట్ కామ్.